మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 15:
కారేపల్లి క్రాస్‌రోడ్‌లో అంతర్ జిల్లాల తనిఖీ కేంద్రం వద్ద చేస్తున్న తనిఖీలలో కారులో తరలిస్తున్న నగదు రూ.2 లక్షలను పోలీసులు పట్టుకున్నారు.దీనికి సంబంధించి కారేపల్లి ఎస్పై పుష్పాల రామారావు తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి.ఎన్నికలలో భాగంగా కారేపల్లి క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన అంతర్‌జిల్లాల చెక్ పోస్టు వద్ద సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.ఈక్రమంలో ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న ఎర్టిగా కారు(ఏపి 39 టీఎఫ్ 8963) ను తనిఖీ చేయగా దానిలో రూ.2 లక్షలు నగదు 500 నోట్లు లభించాయి.ఆ నగదు సంబంధించి కారు యాజమాని తురక సతీష్ ఎటువంటి ఆధారాలు చూపక పోవటంతో జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వటంతో పాటు సీజ్ చేసిన నగదును ఖమ్మం ట్రైజరీ కార్యాలయం తరలించినట్లు తెలిపారు.ఈ తనిఖీలలో కారేపల్లి,కామేపల్లి ఎస్సైలు పుష్పాల రామారావు, ప్రవీణ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
