అంతర్జాతీయ ఎంతో పేరుగాంచిన ‘హలో’ మ్యాగజైన్ తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫొటోలను ప్రచురించింది. వివిధ పోజుల్లో, మహేశ్ బాబు తన గ్లామర్ ఉట్టిపడేలా ‘హలో’ మ్యాగజైన్ పై ఆకట్టుకునేలా ఉన్నారు. ‘హలో వరల్డ్’ అంటూ మహేశ్ బాబు ఈ మ్యాగజైన్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలపై అభిమానులు విశేషంగా స్పందిస్తున్నారు.