ఘనంగా శ్రీదేవి శరన్న నవరాత్రి ఉత్సవాలు
* అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు
* పెద్దమ్మ తల్లి దేవాలయంకు భక్తుల తాకిడి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవపురం జగన్నాధపురం మధ్యలో ఉన్న శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ గుడి) ఆలయంలో శ్రీదేవి శరన్న నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారికి గాయత్రి దేవి అవతారం అలంకరణ చేశారు. మంగళవారం అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు దర్శించనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుతుండడంతో భక్తుల తాకిడికి దేవాలయాలు సందడిగా మారాయి.
తొమ్మిది రోజులపాటు జరగనున్న శరన్న నవరాత్రుల ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కార్య నిర్వహణ అధికారి రజిని కుమారి తెలిపారు.
దేవాలయాలకు విద్యుత్ దీపాల వెలుగులు..
విజయదశమి ఉత్సవాల సందర్భంగా భద్రాద్రి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో ఉన్న దేవాలయాలకు విద్యుత్ దీపాలను అలంకరించారు. రాత్రి వేళల్లో దేవాలయాలు విద్యుత్ వెలుగుల్లో దగదగాలాడుతున్నాయి.