మన్యంన్యూస్,మణుగూరు: తన నామినేషన్ కార్యక్రమం సాదాసీదాగా నిర్వహించనున్నట్లు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,విప్, పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు తెలిపారు. ఆయన సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. రేగా అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల నియమావళి పాటించి దానికి అనుగుణంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు.
