మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 16:
కవి యాకూబ్ ఆధ్వర్యంలో నిర్వహించే రొట్టమాకురేవు అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ రవీంద్రభారతి కాన్పెరెన్స్ హాల్లో కుటుంబ వేడుకలలా జరిగిందని ప్రముక కవి యాకూబ్ తెలిపారు.సోమవారం విలేకరులతో మాట్లాడుతూ,గౌరిశంకర్ అధ్యక్షతన ప్రధానోత్సవం జరిగిందన్నారు.రొట్టమాకురేవు అవార్డుల ఎంపికలో ప్రతిభకల వారికి చొటుదక్కిందన్నారు.ప్రధానోత్సవ సభ అద్యంతం కవిత్వ పరిమళంతో నిండిరదని కొనియాడారు.కవిసంగం కుటుంబ వేడుకగా జరగిందని సహకరించిన తోటి కవి మిత్రులకు,అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో కవయిత్రి శిలాలోహిత పాల్గొన్నారు.
