మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 16:
ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పాలనలోనే పూర్తి భరోసా ఉందని,కాంగ్రెస్ గెలుపు ప్రజలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ బాలాజీ నాయక్ అన్నారు.సోమవారం కారేపల్లి మండలంనో మాధారం,గోవింద్తండా,భజ్యాతండా, బక్కలతండా,భాగ్యనగర్తండా,ఆల్యాతండా. ఉసిరికాయలపల్లి గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ 6 డిక్లరేషన్లపై వివరించారు.ఉసిరికాయలపల్లి కోటమైసమ్మతల్లి ఆలయంలో పూజులు చేసిన బాలాజీనాయక్ ఆల్యాతండాలో జరిగిన బతుకమ్మ వేడుకలలో బాలాజీనాయక్ ఆయన సతీమణి బానోత్ పద్మలతో కలిసి పాల్గని మహిళలతో ఆడుతూ పాడుతూ, సందడి చేశారు.బక్కలతండాలో దుర్గాదేవి మండపంలో పూజలు చేశారు.ఈసందర్బంగా ఆయనకు మహిళలు హారతులతో ఘనంగా స్వాగతం ఫలికారు.ఈసందర్భంగా బాలాజీ నాయక్ మాట్లాడుతూ,బడుగుబలహీన వర్గాలు బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.కేసీఆర్ పాలనంతా అవినీతి,పక్షపాతంతో నడిచి అర్హులకు ప్రభుత్వం ఫలాలు అందలేదని విమర్శించారు. అందరికి సమాన ఫలాలు అందలంటే కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండల కోఆర్డినేటర్ షేక్ అప్సర్,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు గుగులోత్ హర్షానాయక్,ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు నునావత్ సాయికిరణ్,మాజీ ఎంపీటీసీ గడ్డం వెంకటేశ్వర్లు,నాయకులు షేక్ పాష, బానోత్ నరేష్,బానోత్ వినోద్,ఇస్లావత్ శేషు,బర్మావత్ కుృష్ణ,అజ్మీర కుమార్,బాదావత్ భద్రు తదితరులు పాల్గొన్నారు.
