మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరున్నా గెలుస్తారని సర్వేలో వెల్లడైతున్నప్పటికీ పొత్తుల పేరుతో సిపిఐకి కేటాయిస్తామని సరైంది కాదంటూ టీపీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరావు వర్గీయులు జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలుచుంటే భారీ మెజారిటీ దక్కుతుందని అనుకున్నామని కానీ కొత్తగూడెం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలకు విలువ ఇవ్వకుండా టికెట్ సిపిఐకు ఇస్తామంటే రేపటి నుండి బయట ఎలా తిరగాలని ప్రశ్నించారు. తామొకటి తలిస్తే అధిష్టానం మరొకటి తలించి గెలుపు సాధించే కాంగ్రెస్ స్థానాన్ని కామ్రేడ్లతో పొత్తు పేరుతో సిపిఐ సిపిఐకి ఇస్తామంటే ఒప్పుకోబోమన్నారు. జనరల్ స్థానమైన కొత్తగూడెం నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి కేటాయించాడం అంటే ఓటమిని ఒప్పుకున్నట్టే అంటూ పలువురు కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదని రెండవ లిస్ట్ లో ఎట్టి పరిస్థితుల్లో కొత్తగూడెం టికెట్ కాంగ్రెస్ కే కట్టబెట్టాలని కామ్రేడ్లు బలంగా ఉన్న నియోజక వర్గాల్లో సిపిఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరునూరైనా కొత్తగూడెంను పొత్తులో వదులుకునే ప్రసక్తే లేదని ఖరాఖండిగా అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జేబీ శౌరి, పినపాక ఎల్డీఎం కోఆర్డినేటర్ మోతుకూరి ధర్మారావు, జిల్లా ఓబీసీ చైర్మన్ అల్లాడి నరసింహారావు, గరీబ్ పేట ఎంపీటీసీ కసనబోయిన భద్రం, కొత్తగూడెం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్, కొత్తగూడెం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్, సీనియర్ నాయకులు కృష్ణ, హరి సింగ్, శివ, రాందాస్, బీరెల్లి భద్రం, సైదులు, గాండ్ల సురేష్, కాపా శీను, అరిగే గోపి, యూత్ కాంగ్రెస్ నాయకులు బట్టు మురళి, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ ఉస్మాన్, పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ హెచ్ మధు, పాల్వంచ మండల ప్రెసిడెంట్ భూక్యా గిరి ప్రసాద్, లక్ష్మీదేవిపల్లి మండల ప్రెసిడెంట్ అరుణ్, సాయి, కోటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.