బీఆర్ఎస్ మ్యానిఫెస్టో వరాల జల్లు
*మ్యానిఫెస్టోతో ప్రతి ఇంటా పండుగ.
*మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ జేజేలు
*జెడ్పీటీసీ పొశం, బీ. ఆర్.ఎస్ మండల అధ్యక్షులు ముత్యం బాబు,
* టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు
మన్యం న్యూస్, మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవలే విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తెలంగాణలో ప్రతి వ్యక్తికి ఉపయోగపడేలా ఉందని జెడ్పిటిసి పోశం నరసింహారావు, మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యం బాబు, టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావులు అన్నారు.సోమవారం ఆనందోత్సహాల నడుమ మణుగూరు తెలంగాణ భవన్ వద్ద మిఠాయిలు తినిపించుకుంటు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మేనిఫెస్టో ప్రతి ఇంట్లో ఆనందం విరబూయనుందని అన్నారు. ముచ్చటగా మూడోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రానందాన్ని వారు జోస్యం చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పినపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీ. ఆర్.ఎస్ పార్టీ మహిళా నాయకులు, అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘాలు కార్యకర్తలు పాల్గొన్నారు.