మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం ధనియాల పాడు గ్రామ పంచాయతీలోని బీఆర్ఎస్, న్యూడెమోక్రసీ పార్టీ సభ్యత్వం కలిగిన 100 కుటుంబాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ లో చేరినవారిలో దనియలపాడు గ్రామపంచాయితీ కి చెందిన వార్డు మెంబర్లు, బీఆర్ఎస్, యేన్డీ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో పులి సైదులు, అరెం కిరణ్, కృష్ణప్రసాద్, దన్ సింగ్, కుర్రా అరుణ, పోటు రవి, బానోత్ రాంబాబు, ఊరుగొండ ధనుంజయ్, బానోత్ శ్రీను, భూక్యా వీరన్న, ఆముదాల ప్రసాద్,కాకాటి భార్గవ్,రావూరి సతీష్,ప్రసన్న కుమార్ యాదవ్,పాయం ఆంజనేయులు,సప్పిడి ప్రవీణ్, ఉల్లింగ సతీష్, భూక్యా శంకర్ తదితరులు పాల్గొన్నారు.