UPDATES  

 బీఎస్పీ కార్యాలయంలో ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశం

 

మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో గల బీఎస్పీ పార్టీ కార్యాలయంలో సోమవారం బిఎస్పి ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీఎస్పీ ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్ బాదావత్ ప్రతాప్ మాట్లాడుతూ..భవిష్యత్తు ఎన్నికల ప్రణాళిక, రూట్ మ్యాప్, ప్రత్యర్ధులను ఏ విధంగా ఎదుర్కోవాలనే మొదలగు అంశాలపై చర్చించామని తెలిపారు. ఇల్లందు గడ్డమీద నీలిజెండా ఖచ్చితంగా ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు గత పాలకులతో చిరాకుపడి నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. చదువుకున్న యువతీ, యువకులు, నిరుద్యోగులు, చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు, అడ్డకూలీలు, ఉద్యోగస్తులు, అంగన్వాడీలు, పారిశుద్ధ కార్మికులు, ఆశావర్కర్లు, విలేకరులు, రైతులు మా పార్టీ వైపు చూస్తున్నారన్నారు. వీరే బీఎస్పీని కచ్చితంగా ఓట్లువేసి గెలిపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పి జిల్లా కార్యదర్శులు లతాకుల కాంతారావు, చిప్పలపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ అధ్యక్షులు తచ్చొడి సత్యనారాయణ, సీనియర్ నాయకులు పప్పుల గోపీనాథ్, రాయల శ్రీనివాసరావు, పులిమాటి జ్ఞానసుందరం, మండల నాయకులు అజ్మీర వెంకన్న, మానుకోట ఆనందరావు, శ్రీరాములు, రాంప్రసాద్, వినోద్, లోకేష్, రాకేష్, కిరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !