బెంగళూరు/ఉడిపి: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిఏడాది జరిగే స్వాతంత్ర దినోత్సవం వేడుకలు, గణతంత్ర దినోత్సవం (republic day) వేడుకలకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.
ప్రపంచ దేశాల్లోని ప్రధాన మంత్రులు (PM), దేశ అధ్యక్షులతో పాటు వివిద దేశాలకు చెందిన రాజ వంశస్తులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ (MODI) స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే.
2024 గణతంత్ర దినోత్సవం (republic day)వేడుకలకు కర్ణాటకలోని (Karnataka) ఉడిపి జిల్లాలోని కుందాపూర్‌కు చెందిన వీధిలో చెప్పులు, షూలు (shoe) మరమ్మతులు చేసే కార్మికుడిని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించడం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) గణతంత్ర దినోత్సవాన్ని తిలకించే అవకాశం సమాజంలోని కార్మికవర్గానికి కూడా లభించిందని కుందాపురలో నివాసం ఉంటున్న సామాన్య ప్రజలు అంటున్నారు.
కుందాపూర్ లోని శాస్త్రి సర్కిల్ సమీపంలో గత రెండున్నర దశాబ్దాలుగా చెప్పులు, గొడుగులు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తున్న మణికంఠ అనే వ్యక్తికి వచ్చే ఏడాది జనవరిలో జరిగే గణతంత్ర దినోత్సవం (republic day) వేడుకల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఉడిపి (Udupi) జిల్లా కుందాపూర్‌లోని శాస్త్రి సర్కిల్‌లోని లిడ్కర్ షూ రిపేర్ బాక్స్ షాపులో పనిచేస్తున్న మణికంఠను ఈసారి గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించడంపై కేంద్ర ప్రభుత్వం మీద సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.
కర్ణాటకలోని (Karnataka) భద్రావతికి చెందిన తన తాత మునుస్వామి సుమారు 50 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఈ చెప్పుల మరమ్మతు దుకాణాన్ని ప్రారంభించారని, కొంతకాలం తన తండ్రి (father) దీనిని కొనసాగించారని, తండ్రి అనారోగ్యంతో తాను నా కులస్తులు, నా పూర్వికులు చేసే చెప్పులు కుట్టే పనిని ఇంతకాలం కొనసాగిస్తున్నానని మణికంఠ చాలా గర్వంగా చెబుతున్నారు.
సాధారణంగా ప్రజలు చేసేదే నేను చేశాను, నా తాత, తండ్రి చేసిన మా కులం చేతి పనిని నేను కొనసాగించానని. అది నా బాధ్యత అని మణికంఠ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ (modi) తనను గుర్తించినందుకు నిజంగా సంతోషిస్తున్నానని, దీంతో నా బాధ్యత ఇంకా పెరిగిందని మణికంఠ అంటున్నారు. ఎంతో మంది వీవీఐపీలతో (VIP) పాటు పలు ప్రముఖులతో కలిసి మణికంఠ గణతంత్ర దినోత్సవ (republic day) వేడుకుల్లో పాల్గొంటున్నారు