UPDATES  

 మరో బిఆర్ఎస్ నేత రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జోరు ఊపందుకుంది. పోలీంగ్ దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని పార్టీలకు తెగ షాక్‌లు తగులుతున్నాయి. తెలంగాణ అధికార పార్టీ అయిన బిఆర్ఎస్‌లో మాత్రం రాజీనామాల సంఖ్య ఎక్కువైపోతుంది.

తాజాగా మరో బిఆర్ఎస్ నేత రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. అయితే, బిఆర్ఎస్‌లో టికెట్ రాకపోవడంతో అసంతృప్తితోనే పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది.

రాథోడ్ బదులు.. అనిల్ జాదవ్ కు టికెట్‌ : తాజాగా, బోధన్ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఆయన ఇవాళ రేవంత్‌రెడ్డితో సమావేశమయినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం రేవంత్‌ నివాసానికి వచ్చి రాజకీయాలపై చాలాసేపు చర్చించినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ తరఫున గత ఎన్నికల్లో విజయం సాధించారు బాపురావు. అయితే, ఈ సారి అసెంబ్లీ ఎన్నికలకు తనను కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై ఆయన కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు బదులుగా అనిల్‌ జాదవ్‌ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చింది బిఆర్ఎస్‌. దీంతో బాపురావు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, రాథోడ్ రేవంత్‌తో మాట్లాడిన అనంతరం ఆయనకు బోధన్ టికెట్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక సమక్షంలో రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

టిక్కెట్ దొరకని 8మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు : అయితే, ఈసారి బిఆర్ఎస్ పార్టీలో ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దొరకలేదు. ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్‌ ఎమ్మెల్యే రాజయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్, వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్‌, బోధ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌కు టికెట్ నిరాకరించారు. దీంతో వీళ్లలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ముధోల్‌ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలే కాదు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పార్టీ వీడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. స్థానికంగా నల్గొండ మున్సిపల్ వైస్‌ ఛైర్మన్‌ అబ్బగోని రమేష్‌తోపాటు మరికొందరు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాను కూడా కప్పుకున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !