UPDATES  

 అనుమతులతో ప్రచార సామాగ్రి ముద్రించాలి * జిల్లా పౌర సంబంధాల అధికారి

అనుమతులతో ప్రచార సామాగ్రి ముద్రించాలి
* జిల్లా పౌర సంబంధాల అధికారి
ఎం సి ఎం సి నోడల్ అధికారి శ్రీనివాసరావు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అనుమతి పొందిన తర్వాతనే ప్రచార సామాగ్రి ముద్రించాలని జిల్లా పౌర సంబంధాల అధికారి,
ఎం సి ఎం సి నోడల్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఐడిఓసి
కార్యాలయంలోని మీడియా కేంద్రంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో ఎన్నికల ప్రక్రియలో బాగంగా ప్రచారం కొరకు
ముద్రించే కరపత్రాలు, పోస్టర్స్ తదితర అంశాలలో తీసుకోవాల్సిన అనుమతులపై ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంగం నియమ నిబంధనలు మేరకు ప్రతి ముద్రణకు తప్పనిసరిగా అనుమతి పొందాలని చెప్పారు.
ఎన్నికల ప్రచారానికి వినియోగించే కరపత్రాలు, పోస్టర్లు వంటి ప్రతి ప్రచార సామగ్రిని ముద్రణకు ముందుగా భారత ఎన్నికల సంఘం నిబంధనలు సెక్షన్ 127 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు. ప్రచురణకు ఇద్దరు వ్యక్తుల డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పారు. ముద్రించే ప్రతిపై ముద్రణ సంస్థ పేరు సెల్ నెంబర్ ముద్రించిన కాపీల సంఖ్య ప్రచురణ కర్త పేరు తెలియచేయాలని చెప్పారు. అనుమతులు లేకుండా ప్రచార ప్రతులు ముద్రణ చేస్తే ఎన్నికల సంగం నియమాల ప్రకారం చర్యలుంటాయని స్పష్టంచేశారు. అదే విధంగా ఎన్నికల ప్రచారంకై ముద్రించే ముద్రణలలో వివాదాస్పద వాఖ్యలు కానీ ఇతరులను కించపరిచే అంశాలు మత కులాల ప్రస్తావన ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలు ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. ప్రచారానికి వినియోగించే ముందు 4 ప్రతులను అందచేయాలని చెప్పారు. అనుమతి పొందిన తర్వాతనే ప్రచారంలో వినియోగించు కోవాలన్నారు. ముద్రణలో క్లెయిము కొరకు బిల్లులు సాధారణ పేపర్ పై ఇవ్వరాదని సంస్థ బిల్ పై మాత్రమే ఇవ్వాలని 20 వేలు దాటితే ఎన్నికల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన బ్యాంకు ఖాతా నుండి చెల్లింపులు చేయాలని చెప్పారు. నిబంధనలు పాటించని వారికి 2 వేలు జరిగినమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష, రెండు అమలు చేసే అవకాశం ఉందన్నారు. అనంతరం ఎన్నికల వ్యయ నియంత్రణ అధికారి, జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు ప్రింటర్స్ పాటించాల్సిన నియమాలపై వివరించారు. ఈ సమావేశంలో ప్రింటర్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !