మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి: అశ్వారావుపేట నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా మంగళవారం విస్తృత పర్యటన చేపట్టారు. అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని పరిశీలించి అధికారుల నుండి వివరాలు సేకరించారు.అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు.తనిఖీల్లో భాగంగా అశ్వారావుపేట కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద పోలింగ్ కేంద్రన్ని తనిఖీ చేసిన ప్రియాంక అలా ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మన ఊరు మన బడి కార్యక్రమ పనులు పూర్తి అవ్వకుండానే పూర్తి అయినట్లు తప్పుడు నివేదికలు ఇవ్వటమే కాకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా పనులు పూర్తి చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ప్రియాంక అలా. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి జీతాలను నిలుపుదల చేశారు.వెంటనే పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.