అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాలకవర్గం అశ్రద్ద చెయ్యొద్దు. దసరా ఉత్సవ సమితి
మన్యం న్యూస్ ఇల్లందు:- దసరా ఉత్సవాలకు పేరెన్నికగన్న ఇల్లందులో దాదాపుగా 100 సంవత్సరాల క్రితం నుంచి మిషనరీ గ్రౌండ్లో ఉత్సవాలు నిర్వహించటం పరిపాటి. గత సంవత్సరం జమ్మి , షావా ఉత్సవాలను మిషనరీ గ్రౌండ్ కాదని పాలక వర్గం సింగరేణి స్కూల్ గ్రౌండ్లో నిర్వహించింది. దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అనాదిగా వస్తున్న ఆచారం తప్పినట్లు అయింది. ఇ సారి అలా జరగటానికి వీల్లేదంటూ, ఏటేటా నిర్వహించే చోటనే నిర్వహించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్, దసరా ఉత్సవ సమితి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వస్తున్నారు. మంగళవారం మడత వెంకట్ గౌడ్ తన క్యాంపు కార్యాలయంలో ఈ విషయమై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ అనాదిగా వస్తున్న ఆచారాన్ని నిర్లక్ష్యం చేసి ఇల్లందు కు కీడు చేసే ప్రయత్నాలు మానుకోవాలని పాలక వర్గానికి సూచించారు. ఇల్లందులో దసరా ఉత్సవాలు మైసూర్ను తలపించే విధంగా ఉంటాయయని, ఆచార సాంప్రదాయాలకు నెలవైన షావా, జమ్మి ఏర్పాటు చేసుకొని నిర్వహించుకునే వేడుకల్లో అశ్రద్ద చేయొద్దన్నారు. గత ఏడాది సింగరేణి స్కూల్ గ్రౌండ్ లో మున్సిపల్ పాలకవర్గం దసరా ఉత్సవాలు నిర్వహించి, అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చి వేరేచోట దసరా ఉత్సవాలు నిర్వహిస్తే ఇల్లందుకు అరిష్టమని పెద్దలు తెలియజేస్తున్నారని అన్నారు. కోరం కనకయ్య ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఆయన సోదరుడు మృతి చెందిన ముట్టుతో దసరా ఉత్సవాలలో పాల్గొనడంతో ఎన్నికల్లో ఓటమిపాలై ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రావణ వద లాంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరుపుకోవచ్చని, జమ్మి పూజలు మాత్రం సాంప్రదాయం ప్రకారం మిషనరీ గ్రౌండ్ లోనే నిర్వహించడం శ్రేయస్కరమన్నారు. నిర్లక్ష్యం చేస్తే పిల్లలు అరిష్టానికి గురవుతారన్న పెద్దల మాటను గుర్తుంచు కోవాలన్నారు. మిషనరీ గ్రౌండ్లో విలుకాకపోతే ఫారెస్ట్ గ్రౌండ్లో జమ్మి పూజలతో పాటు రావనవధ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. మరో మారు పెద్దలందరూ కలిసి ఆలోచించి దసరా ఉత్సవ కమిటీకి తెలియజేయాలని కోరారు. అనంతరం స్థానిక తాసిల్దార్ కోట రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు.