మన్యం న్యూస్,చండ్రుగొండ,అక్టోబర్ 18: మండలంలో నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ సమావేశాన్ని విజయవంతం చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.అయన బుధవారం చండ్రుగొండ శివారులో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించి, మండల పార్టీకి తగిన సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగిందన్నారు. జెడ్పీటీసీ వెంకటరెడ్డి ఇంటికి ఎమ్మేల్యే మెచ్చ స్వయంగా వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏకాంతంగా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. బహిరంగసభకు కార్యకర్తలను ఏవిధంగా తరలించాలనే అనే విషయాలను చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. చండ్రుగొండ జెడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొణకండ్ల వెంకటరెడ్డి బిఆర్ఎస్ పార్టీలో గురువారంఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్ధసార్ధరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వవిప్ రేగా కాంతరావు సమక్షంలో చేరనున్నారన్నారని మెచ్చ తెలిపారు.బహిరంగ సభకు వచ్చే ప్రముఖులకు బిఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలకాలన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీదే విజయమని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ విధనాలతో విసుగు చెందిన నాయకులు బిఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారన్నారు. తెలంగాణ కోసం నిరంతరం పరితపించే పార్టీ బిఆర్ఎస్ ఒక్కటేనన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు దారా వెంకటేశ్వరరావు (దార బాబు), ఉప్పతల ఏడుకొండలు, సయ్యద్ రసూల్, భూపతి రమేష్, సూర వెంకటేశ్వరరావు, గుగులోత్ శ్రీనివాస్ నాయక్ , వంకాయలపాటి బాబురావు, సత్తి నాగేశ్వరరావు, భూపతి శ్రీనివాసరావు, మద్దిరాల చిన్నిపిచ్చయ్య, బానోత్ రన్య, పూసం వెంకటేశ్వర్లు, చాపలమడుగు రామరాజు, ఓరుగంటి రాములు, శ్రావణ్ కుమార్, కేకోత్ శ్రీను, బానోత్ బీలు, మంద అనిల్, బానోత్ రంగా, తదితరులు పాల్గొన్నారు.