మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ఎట్టి నరసయ్య కుమారుడు ఎట్టి భానుశంకర్(30) సంవత్సరాలు ఆరోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య వారి నివాసానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో చొప్పాల సర్పంచ్ జవ్వాజి.రాధ, ఉప సర్పంచ్ బొడ.ప్రశాంత్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు పాయం.రాజబాబు, నాయకులు జవ్వాజి.సమ్మయ్య,నిట్టా.ప్రభాకర్,కటకం. నర్సింహులు,చిట్టిమల్ల.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.