రేగా అభివృద్ధి చూద్దాం రారండోయ్
నాడు, నేడుగుండాల అభివృద్ధి బాటలు వేసిన రేగా
ఎమ్మెల్యే గెలిచిన నాటినుండి గుండాల ఆళ్ల పల్లి మండలాలకునిధుల సునామి
*వందల కోట్ల నిధుల మంజూరు తో ప్రగతి పథంలో ఉమ్మడి గుండాల
అభివృద్ధి తో కార్ పార్టీ కి పెరిగిన మైలేజ్
*రేగాకు మెండు గా ఉమ్మడి గుండాల ప్రజల ఆశీర్వాదం
మన్యం న్యూస్ గుండాల: అభివృద్ధికి ఆయనే వారధి.ప్రజల కష్టాలు చూసి చలించిన వ్యక్తి.వారి కష్టాలను తన కష్టాలుగా భావించిన వ్యక్తి. సమస్యలు ఎంత దూరంలో ఉన్న వాటి దగ్గరికి వెళ్లి అన్వేషణ చేసిన వ్యక్తి .ఆయనే పినపాక అభివృద్ధి ప్రదాత రేగా కాంతారావు. ఎలాగైనా వారి కష్టాలను తీర్చాలనేపట్టుదలతో… పట్టు వదలని విక్రమార్కుడిలా పట్టుబట్టి మరి నిధులు సాధించారు. ఉమ్మడి గుండాల మండల అభివృద్ధికి ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన కృషి పై మన్యం న్యూస్ ప్రత్యేక కథనం. 2018లో పినపాక ఎమ్మెల్యే గా రేగా కాంతారావు గెలిచిన నాటినుండి గుండాల ఆళ్ల పల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పథంలో ముందుకెళ్లేందుకు తన వంతు బాధ్యతను పోషిస్తున్నారు. గుండాల ఆళ్ల పల్లి మండలాలకు నిధులు కేటాయిస్తూ ప్రజా ప్రతినిధులను ప్రోత్సహిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. గతంలో గుండాల మండలం లో రహదారుల పరిస్థితి కడుదుర్భరంగా ఉండేది. ఏ గ్రామానికి వెళ్లాలన్న మోకాళ్ళ లోతు బురద తో రహదారులు దర్శనమిచ్చేవి. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి రెండు మండలాలపై ప్రత్యేక దృష్టిసారించి నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి వడివడిగా అడుగులు వేస్తున్నాడు. గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో మొత్తం గిరిజన గ్రామాలే ఉన్నాయి వాటి చుట్టూ కిన్నెరసాని , మల్లన్న వాగు , ఏడు మెలికల వాగు , దున్నపోతుల వాగు , జల్లేరు వాగు ప్రవహిస్తూ ఉంటాయి, వర్షాకాలం వచ్చిందంటే ఈ వాగు లన్ని ప్రవాహానికి మించి ప్రవహిస్తూ ఉంటాయి ప్రజలు వైద్య సౌకర్యంతో నిత్యావసర వస్తువుల కోసం నిత్య ఈ వాగుల పై ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వాగులు ప్రవాహానికి మించి ప్రవహించే ప్రవహించే సమయంలో దాటలేక గర్భిణిలు నాన్న నరక యాతన పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గర్భిణీలు వర్షాకాలం వచ్చిందంటే చాలు గుండెల్లో దడ పుట్టేది కొందరు వాగుల ప్రవాహం లేని గ్రామాల్లో వారి బంధువుల ఇంటి వద్ద ఉండి వైద్య సౌకర్యం పొందేవారు. వాగులు ప్రవహించే సమయములో అంబులెన్సులు సైతం దాటక వైద్యం అందక కొందరు మృత్యువాత పడ్డ రోజులు కూడా గతంలో నెలకొన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ పూర్తి భిన్నంగా రెండు మండలాల్లోని రహదారులు అందుబాటులోకి వచ్చాయి మొత్తం వంతెనలు పూర్తి కావడంతో గిరిజనుల్లో ఆనందోత్సవాలు కనబడుతున్నాయి కిన్నెరసాని మల్లన్న వాగు దున్నపోతుల వాగు జల్లేరు వాగు లపై వంతెన లన్నీ పూర్తి వి అందుబాటులోకి వచ్చాయి అన్ని గ్రామాలకు డాంబర్ రహదారులు వేయడంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాకపోకలను సాగిస్తున్నారు. గతంలో ఈ వాగులను గర్భిణీలు దాటాలంటే కుటుంబ సభ్యులు చేతులపై ఎత్తుకొని దాటించి వలసిన పరిస్థితి నెలకొన్నది ఇప్పుడు రెండు మండలాల్లోని అన్ని గ్రామాలకు అంబులెన్స్ వెళ్లే విధంగా రహదారులు పూర్తయ్యాయి.వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఉమ్మడి గుండాల మండలాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. వచ్చే ఏడాదికల్లా మిగిలిన వంతెనల నీ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే రెండు మండలాల్లో పూర్తిస్థాయిలో రవాణా వ్యవస్థ మెరుగు పడినట్లే ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితోనే ఇదంతా సాధ్యమైందని మండల ప్రజలు అభిప్రాయాలతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గుండాల ప్రజల కష్టాలను తీర్చడంతో బీఆర్ఎస్ పార్టీకి మైలేజీ పెరిగింది. తమ కష్టాలు తీర్చిన రేగా కాంతారావుకి ఉమ్మడి గుండాల ప్రజలు బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నారు. రానున్న రోజులలో ఉమ్మడి గుండాల అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలంటే… మరోమారు రేగా కాంతారావుని గెలిపించుకుంటామని ఉమ్మడి గుండాల మండలంలోని పంచాయతీల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.