UPDATES  

 ఎన్నికల కోడ్ పేరుతో యాజమాన్యం డ్రామాలు

ఎన్నికల కోడ్ పేరుతో యాజమాన్యం డ్రామాలు
* సింగరేణి కార్మికులకు చెల్లించే లాభాల బోనస్ ప్రభుత్వ పథకం కాదు
* నిధులు మల్లించుకునే కుట్రలను అడ్డుకుంటాం
* 20న హెడ్డాఫీస్ ముట్టడి, 21న ఒక్క రోజు టేకెన్ సమ్మె
* వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లింపు విషయంలో సింగరేణి యాజమాన్యం డ్రామాలు చేస్తుందని ఎన్నికల కోడ్ పేరుతో సింగరేణి కార్మిక కుటుంబాలకు పండుగల సంతోషానికి దూరం చేయడం దుర్మార్గమైందని, కార్మికుల కష్టార్జితం చెల్లింపు విషయంలో ఎన్నికల కోడ్ ను ముడిపెట్టడమేంటని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్యలు ప్రశ్నించారు. స్థానిక శేషగిరిభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. లాభాలవాటా చెల్లింపు విషయంలో కలుగుతున్న సాంకేతిక ఇబ్బందులపై కేసీఆర్, టిబిజికెఎస్, సింగరేణి యాజమాన్యం స్పందించకపోవడం వెనుక ఆంతర్యమేమిటని అన్నారు. ఎన్నికల ఖర్చులకు బిఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మికుల కష్టార్జితాన్ని దోచిపెట్టారనే అనుమానాలు వ్యక్తంవుతున్నాయన్నారు. వాటా సొమ్ము కార్మికుల కష్టించి సాధించిపెట్టిందని అది ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేదికాదని ఎన్నికల సంఘానికి తెలియదా అని ప్రశ్నించారు. పర్సంటేజీ ప్రకటించినంత మాత్రాన అది ప్రభుత్వ సొమ్ము కాదని, ప్రభుత్వ సంక్షేమ పథకం కాదని ఎన్నికల కోడు ఎలాంటి అడ్డు కాబోదన్నారు. ప్రభుత్వ ద్వారా చెల్లిస్తున్న ఆసరా పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల చెల్లింపుకు ఎన్నికల కోడ్ అడ్డు రాదాని ప్రశ్నించారు.
కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, టిబిజికెఎస్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. లాబాల వాటా, బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోలన చేపడుతున్నామని, 21న ఒక్క రోజు టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చామని, సంఘాలకతీతంగా కార్మికులు ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో యూనియన్ కేంద్ర కమిటి నాయకులు జి.వీరస్వామి, వంగా వెంకట్, కిష్టాఫర్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !