UPDATES  

 అందుబాటులోకి ఎన్ పవర్ మెంట్ సెంటర్!

అందుబాటులోకి ఎన్ పవర్ మెంట్ సెంటర్!
* పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు శ్రీకారం
* మన్యం న్యూస్ ఎఫెక్ట్.. పడిన ముందడుగు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
పేద కుటుంబాలు వివిధ శుభకార్యాలు పెళ్లిళ్లు జరుపుకొనుటకు కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని హనుమాన్ బస్తీలో కమ్యూనిటీహాల్ (ఎన్ పవర్ మెంట్ సెంటర్) నిర్మాణాన్ని పూర్తి చేసి సిద్ధం చేశారు. అయితే కొన్ని చిన్నచిన్న పెండింగ్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఆ సెంటర్ అసంపూర్తిగా నిలిచిపోయింది. గత ఏడు సంవత్సరాలుగా కమ్యూనిటీ సెంటర్ కు గ్రహణం పట్టిపీడిస్తోంది. అసంపూర్తిగా నిలిచిపోయిన సెంటర్ సముదాయంపై గత నెలలో “మన్యం న్యూస్ దినపత్రికలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా కమ్యూనిటీ సెంటర్” అనే కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విధితమే. ఈ కథనానికి ఎట్టకేలకు సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు. పెండింగ్ పడిన కమ్యూనిటీ సెంటర్ కు అవసరమయ్యే మరుగుదొడ్లు, మూత్రశాలలు, హ్యాండ్ వాష్ సౌకర్యాలు వంటి పనులు గత వారం రోజులుగా జరుగుతున్నాయి. త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేసి పేద కుటుంబాలు శుభకార్యాలు పెళ్లిళ్లు చేసుకునేందుకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశించడంతో పనులు చక చక జరుగుతుండడం పట్ల అన్ని వర్గాల వారి కుటుంబాల నుండి హర్షం వ్యక్తం అవుతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !