UPDATES  

 ఆ డైరెక్టర్ తో విక్రమ్ కొత్త సినిమా..?

స్టార్ హీరో విక్రమ్ కు పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా భారీ విజయాన్ని అందించింది.. ఈ సినిమాకు ముందు హీరో విక్రమ్‌ కెరీర్‌లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి..

గతంలో ఆయన ఎన్నో సినిమాలలో నటించాడు.. ఆ సినిమాలు అన్ని ఓటిటిలో విడుదలయ్యేవి.. కొన్ని సినిమాలు వచ్చిన రెండు రోజులకే వెనక్కి వెళ్ళేవి.. దాంతో విక్రమ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.. అలాంటి సమయంలో పొన్నియిన్‌ సెల్వన్‌ రెండు భాగాలుగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్‌ విక్రమ్‌కు మంచి బూస్ట్‌ నిచ్చిందనే చెప్పాలి.

తాజాగా పా. రంజిత్‌ దర్శకత్వంలో ఈయన నటించిన తంగలాన్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది..స్పెషల్ గెటప్ లు వెయ్యడం విక్రమ్ కు కొత్తేమి కాదు.. ఇక తంగలాన్‌ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల కోసం విక్రమ్‌, మాళవిక మోహన్‌తోపాటు యూనిట్‌ వర్గాలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా విక్రమ్‌ కథానాయకుడిగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నటించిన ధ్రువనక్షత్రం చాలాకాలంగా వాయిదాపడుతూ వస్తోంది.. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది..

విడుదల కావాల్సిన సినిమాలు ఉండగానే ఇప్పుడు మరో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.. సిద్ధార్థ్‌ కథానాయకుడిగా నటించి అరుణ్‌ కుమార్‌ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం చిత్తా.. తెలుగులో చిన్నా పేరుతో విడుదలై ప్రశంసలు అందుకుంది.. కాగా ఈ దర్శకుడు విక్రమ్‌ కథానాయకుడిగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని శింబు తమీన్‌ నిర్మించనున్నారని తెలిసింది. ఈయన ఇంతకుముందు విక్రమ్‌ ద్విపాత్రాభినయం చేసిన ఇరుముగన్‌ సినిమా నిర్మాతగా వ్యవహారించారు..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !