తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో సినిమా ‘కీడా కోలా’తో వస్తున్నారు.
క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్‌తో ఈ సినిమా హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేయగా ఈరోజు ఈ సినిమాను సమర్పిస్తున్న రానా దగ్గుబాటి థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ తరుణ్ భాస్కర్ దాస్యం కొన్ని పంచ్ లు వేశారు. ముందుగా మీడియా ప్రతినిధులు మీరు సినిమాలు డైరెక్ట్ చేయకుండా ఎందుకు నటన మీద ఫోకస్ పెడుతున్నారు? అనే విషయాన్ని గట్టిగా ఫోకస్ చేయగా అది తన తీట అని ఆయన చెప్పుకొచ్చారు.
అంతేకాక ఎందుకు సురేష్ బాబు గారి కాంపౌండ్ లోనే ఉండిపోయారు, ఆయనతోనే ఎందుకు సినిమాలు చేస్తున్నారు అని అడిగితే తనకు సురేష్ అనే పేరు కలిసి వచ్చిందని అన్నారు. న్యూమరాలజీ, నమ్మే తాను సురేష్ అనే పేరు ఉన్న వారితో ఎవరితో అయినా సినిమాలు చేస్తానని అన్నారు. సురేష్ కొండేటితో కూడా సినిమాలు చేస్తానని అన్నారు. అలాగే నటన మీదనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అని అడిగితే దానికి ఆయన స్పందిస్తూ జర్నలిస్టు అయిన సురేష్ కొండేటి డాన్స్ చేయవచ్చు కానీ డైరెక్టర్ అయిన నేను సినిమాల్లో నటించకూడదా ? అని ప్రశ్నించారు. అంతేకాక తాను జర్నలిస్టుగా అవ్వాలని అనుకుంటున్నానని కోర్సు చేసి వస్తానని కూడా ఆయన కామెంట్ చేయడం గమనార్హం.