*బీఆర్‌ఎస్ గెలుపు కోసం ఐక్యంగా పనిచేద్దాం-
– ప్రజా ప్రతినిధులతో సమావేశమైన బీ. ఆర్. ఎస్ వైరా ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ లాల్
మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 19:
బీఆర్‌ఎస్‌ను మూడోసారి అధికారంలోకి తేవటానికి మనస్పర్ధలు వీడి గెలుపుకోసం ఐక్యంగా పని చేద్దామని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వైరా నియోజవర్గ అభ్యర్ధి బానోత్ మదన్‌లాల్ అన్నారు.గురువారం కారేపల్లి వైఎస్‌ఎన్ గార్డెన్‌లో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశం పార్టీ మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్ అధ్యక్షతన జరిగింది.ఈసమావేశంలో బానోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ,ఎన్నికల ప్రచారాన్ని ప్రజాప్రతినిధులుగా ముందుకు పోవల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.అమరకలు లేకుండ పని చేద్దామని బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవటం ద్వారా మరిన్ని సంక్షేమ పధకాలను ప్రజాప్రతినిధుల ద్వారా అమలు జరుపుకోవచ్చన్నారు.సమస్యలుంటే నియోజవర్గ ఇంచార్జీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు విన్నవించుకుందాన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల,జడ్పీటీసీ వాంకుడోత్ జగన్,వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, సంత ఆలయ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య,సోసైటీ ఉపాధ్యక్షులు దారావత్ మంగీలాల్,సర్పంచ్‌లు సంఘం అధ్యక్షులు భూక్యా రంగారావు,ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు దారావత్ పాండ్యానాయక్,దిశ కమిటీ సభ్యులు బానోత్ కుమార్,సీనియర్ నాయకులు తోటకూరి పిచ్చయ్య,మాలోత్ కిషోర్,సర్పంచ్‌లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.