మన్యం న్యూస్ ,గుండాల: పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ,ప్రభుత్వ విప్ ప్ రేగా కాంతారావు చేసిన అభివృద్ధి పనులే రేగా ను మరో మారు గెలిపిస్తాయని పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్నా అశోక్ కుమార్ అన్నారు. గురువారం గుండాల మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని సయన్నపల్లి, గుండాల, లింగగూడెం పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ. దళితుల కోసం ఏ ప్రభుత్వం చేయని పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలలో దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, మిషన్ భగీరథ, 24 గంటల ఉచిత కరెంట్, ఆసరా పింఛన్లను అందిస్తున్నారా అని అన్నారు. ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నిట్ట రాములు, ఎస్సీ సెల్ నాయకులు గంగారపు రమేష్, తడికమల్ల ప్రభుదాస్, బోయిళ్ళ రమణయ్య, మేకల రవి, గుండాల మండల నాయకులు బొమ్మెర నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు భూపెళ్లి లలిత తదితరులు పాల్గొన్నారు