మన్యం న్యూస్ ,భద్రాచలం:
మైనర్ బాలికపై ఓ పార్టీ నాయకుడి అత్యాచారయత్న నికి ప్రయత్నించినట్లు బాలిక తల్లిదండ్రులుభద్రాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.నిందితున్ని అదుపులోకి తీసుకోవాలంటూ మహిళా సంఘాల ఆందోళన చేశారు. భద్రాచలం పట్టణంలోని లాడ్జిలో అఘాయిత్యానికి పాల్పడుతుండగా కుటుంబ సభ్యులు అడ్డగించి ,దేహ శుద్ధిచేశారు. బాలికపై అత్యాచారయత్నానికి వడికట్టిన వ్యక్తికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వరమే కఠినంగా శిక్ష పడేలా చూడాలంటూ విద్యార్థి ,యువజన మహిళా సంఘాల డిమాండ్ చేశారు.