*వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం
*అన్నదానం మహాదానం
*బీ. ఆర్.ఎస్ యూత్ నియోజకవర్గ అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్
మన్యం న్యూస్, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అభిమాని,బీ. ఆర్. ఎస్ పినపాక నియోజకవర్గం యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ అశ్వాపురం మండలంలోని సీతారాంపురం గ్రామంలో గల మానవీయ వృద్ధాశ్రమంలోని శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు గద్దల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కోరం రామారావు, ఉపాధ్యక్షులు రాసాల రమేష్, వెంకటేశ్వర్లు,నాగేష్ అఖిల్, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.