మన్యం న్యూస్,భూర్గంపాడు:మండల పరిధి
సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ వడియా క్యాంపులో శనివారం మండల బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను పంచుతూ ,ఆ పార్టీ నూతన మేనిఫెస్టోలోని వాటి యొక్క పథకాల గురించి వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది. నవంబర్ 30 తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ పినపాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి రేగా కాంతారావు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధి లో భాగస్వాములు కావాలని ప్రజలను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరారు. బూర్గంపాడు మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. యువకులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది.
