మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలంలోని సమితి సింగారం పంచాయతీ బాపూజీ నగర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దెల తిరుమలరావు మామ ఏంపల్లి నరసయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు.విషయం తెలుసుకుని నరసయ్య పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి,సిసి రేగా రవి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ నాయకులు నాయకులు,మహిళ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.