- ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలుపే లక్ష్యం
- కార్మికులకు విస్తృత ప్రచారం
- ఓబీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రామకోటి
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలంలోని ఓసీ-4 దుర్గ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఏ రిలే,సీ రిలే కార్మికులను బిఆర్ఎస్ ఓబీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రామకోటి ఆధ్వర్యంలో కలసి బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కరపత్రాలను కార్మికులందరికీ అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఓబీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రామకోటి మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు.అద్భుతమైన పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం జరిగిందని వారు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను కార్మికులకు వివరించారు.పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయని అన్నారు.కెసిఆర్ బీమా, గృహలక్ష్మి,అన్నపూర్ణ,ఆరోగ్య రక్ష వంటి పథకాలతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి బిఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు.పినపాక నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కారు గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో అభివృద్ధి గెలిపించాలని వారు కార్మికులకు కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఓబీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాదేవి అశోక్, మల్లెల రామయ్య,ట్రెజరర్ గడిదేసి మధు బాబు, జాయింట్ సెక్రెటరీ కణతాల మహేష్,ఆర్గనైజేషన్ సెక్రటరీ తమ్మిశెట్టి లక్ష్మీనారాయణ, ప్రచార కార్యదర్శి నాగరాజు, బాధావత్,రమేష్,యర్రోజు రాము,గడ్డంఅశోక్,గుంటక అనిల్,గుజ్జ.నాగరాజు,తురక శ్రీనివాస్,బొమ్మిని దుర్గా ప్రసాద్ పిట్ కమిటీ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.