మన్యం న్యూస్ చర్ల:
బూటకపు అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పిలుపునిచ్చి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే నాటికి రాజకీయ క్రీడా దగ్గర పడుతుండటంతో పార్లమెంటు పార్టీలన్నీ ఒకరిని మించి మరొకరు పోటీపడి హామీల వర్షం గుప్పించారు డబ్బు మద్యం కులం మతం అనే దుర్మార్గాలను ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా గెలిచిన అభ్యర్థులను కొని అధికారం చేపట్టనున్నారు మీరు ఓట్లు వేసే బానిసలు మేము ఓటును వేయించుకునే యజమానులం అనే ఈ తంతును బూటకపు ఎన్నికల అనకా మరి ఏమంటారు
ఓట్లకు వచ్చే రాజకీయ నాయకులు నిలదీయండి ఆదివాసీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోనే 5వ 6వ షెడ్యూల్ 244 (1 )(2) పెస 1996 చట్టం అటవీ భూముల గుర్తింపు చట్టం 2006 జీవో నెంబర్ 3, 1/70 ఎందుకు అమలు చేయట్లేదు మీరు చేయగలరా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రకటబండి గ్రామాలు చేస్తూ ఆదివాసి దళితులపై జరుగుతున్న అన్యాయాలను అత్యాచారాలను హింసలను ఆపగలరా దళితులతో సహా భూమి లేని రైతాంగానికి భూమి ఇవ్వగలరా ప్రతి మండల సెంటర్లో మండీలు ఏర్పాటు చేసి పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉచిత ఎరువులు సాగినీరు కల్పించగలరా ప్రతి గ్రామంలో హాస్పిటల్ ఏర్పరిచి అర్హత కలిగిన వైద్యులను నిరంతరం అందుబాటులో ఉంచగలరా ఇలాంటి మౌలిక సమస్యలకు గ్యారెంటీ ఇవ్వకుండా ఓటు బ్యాంకు కోసం నిరుపయోగ పథకాలను ఉచితంగా కనిపిస్తామంటూ ప్రజలను మోసగించాలనుకుంటున్నారు వారిని నిలదీయండి ప్రజా కోర్టులో నిలబెట్టండి ఆకలి దరిద్రం దోపిడీ అసమానతలు లేని సమ సమాజ స్థాపన కోసం నూతన ప్రజాస్వామ్యకు విప్లవాన్ని విజయవంతం చేయండని పథకాలు అమలు చేయని ప్రభుత్వాలను, నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.