- బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా సత్తా చాటాలి
- విజయం మనదే.. మెజార్టీ కోసమే ఎన్నికలు
- రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్దే అధికారం
- ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
- రేగన్న గెలుపే లక్ష్యంగా ఈ నెల రోజులు పనిచేయాలి:కర్నె మురళి
మన్యం న్యూస్,మణుగూరు:
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సత్తా చాటాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.ఆదివారం మణుగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి అధ్యక్షన నిర్వహించారు.
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో విజయం మనదేనని, మెజార్టీ కోసమే ఎన్నికలు వరకు వేచి చూస్తున్నామని, ప్రచారంలో పవర్ఫుల్ వెపన్ సోషల్ మీడియానేనని, అనవరస పోస్టులు పెట్టకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పైనే ఫోకస్ ఉండాలని, రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్దే అధికారమని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని, అభివృద్ది ఫలాలు అందరికీ తెలిసేలా ప్రణాళిక ఉండాలని మణుగూరు మండల, టౌన్ సోషల్ మీడియా ప్రత్యేక సమావేశం ఈ సందర్భంగా మణుగూరు మండలంలో 66బూత్ స్థాయిలో సోషల్ మీడియా కమిటీ ఎంపిక చేశారు. అనంతరం మణుగూరు టౌన్ సమన్వయకర్తలుగా తాళ్లపల్లి నాగరాజు, బానోత్ పుష్పలత, రూరల్ సమన్వయ కర్తలుగా డేగల సంపత్‌కుమార్, చెలికాని రామకృష్ణ నియామకం చేశారు. ముందుగా ఈ ముఫ్పై రోజులు రేగన్న గెలుపుకోసమే మా ఆరాటం.. మా పోరాటం సోషల్ మీడియా ప్రచారంలో నేటి నుంచి ఒకపై యుద్ధమే..అన్న ప్రతిజ్ఞను సోషల్ మీడియా సభ్యులతో చేయించి సోషల్ మీడియా వారియర్స్‌లో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ.. రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్దే అధికారమని, ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాదే కీలక పాత్ర ఉంటుందని, ప్రతి బూత్ స్థాయికి చేరేలా ప్రణాళిక సిద్ధం చేయాలని, అనవసర చర్చలు కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలు తెలిసేలా పోస్టులు ఉండాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధికి.. కపట నాటకానికి మధ్య జరుగుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మూడో సారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ రావడం ఖాయమని, పినపాకలో బంపర్ మెజార్టీతో గెలవబోతున్నామని పేర్కొన్నారు.
సోషల్ మీడియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కర్నే మురళి మాట్లాడుతూ.. ఈ ముఫ్పై రోజులు పినపాకలో రేగన్న గెలుపే లక్ష్యంగా శ్రమించాలన్నారు. ప్రభుత్వ పథకాలను, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రచారం చేయడంలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావు చేసిన అభివృధ్ది పనులపై ప్రతి గడపకూ చేరేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం పినపాక నియోజకవర్గ అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, మండల టౌన్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ మారోజు రమేష్,, రూరల్ అధ్యక్షులు సురేందర్ పటేల్, రేగా సోషల్ మీడియా వారియర్స్ గుంటక ఏషవ్, పాయం నామా నర్సింహా, గుంటక ప్రవీణ్, పిల్లి అఖిల్ కుమార్, సిరికొండ సంగీత్, ఎస్కె బాజీ, బానోత్ అనూష, మెగరం యువరాజు, తోటమళ్ల శివశంకర్ తదితరలు పాల్గొన్నారు.