- పినపాక లో రేగా సుదక్క పర్యటన
- రేగాగెలుపుతోనే పినపాక నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం
- రేగ సుధామ్మకు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు
- ప్రత్యేకంగా కలిసిన యువకులు
మన్యం న్యూస్,పినపాక: మండల పరిధి పినపాకలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి రేగ సుధారాణి ఆదివారం పర్యటించారు. తొలుత స్థానిక మహిళ సోదరీమణులు మంగళ హారతి తో ఆశీర్వదించారు. అనంతరం ఆమెపై పూలు వెదజల్లుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం అభివృద్ధి పదంలో మరింత ముందుకు సాగాలంటే మరో మారు పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆమె కోరారు. రానున్న ఎన్నికలలో యువత క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారని… అభివృద్ధిని ఆశీర్వదించాలని ఆమె కోరారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే రేగా కాంతారావు గెలుపు తోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తో గూడెం ఎంపీటీసీ డాక్టర్ చింతపంటి సత్యం, స్థానిక యువకులు రాజమళ్ళ సందీప్, రాజమళ్ళ నరేందర్, రాజమల్ల రాంబాబు, గంట సంతోష్, గంట రాజా,మహిళలు తదితరులు పాల్గొన్నారు.