మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వచ్చే నెల ఐదవ తేదీన కొత్తగూడెం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులు సోమవారం పరిశీలించారు. బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”కి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఆయన హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం చేరుకోనున్నందన పట్టణంలోని ప్రగతి మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మైదానాన్ని పరిశీలించిన వారిలో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే వనమాలతో పాటు బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తలు సర్థార్ పుటం పురుషోత్తం రావు, బత్తినీడి ఆది విష్ణుమూర్తి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.