ములకలపల్లి.మన్యం న్యూస్.అక్టోబర్ 30: మద్యం మత్తులో అన్నను తమ్ముడు హత్య చేసిన సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. మృతుని కుటుంబ సభ్యులు ,పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండలం లోని మొగరాలగుప్ప గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద నివాసం ఉంటున్న కీసరి రామారావు,కీసరి వెంకటేష్ అన్నదమ్ములు .ఇరువురు మధ్య గొడవ జరిగింది.ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న కీసరి వెంకటేష్ కర్ర సహాయంతో తన అన్నను తల వెనుక భాగంలో కొట్టగా తీవ్రమైన రక్త స్రావం జరిగింది. ఈ క్రమంలో కీసరి రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు.కీసర రామారావు తల్లి కీసరి బుల్లెమ్మ ఫిర్యాదు మేరకు ములకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. హతుడు కీసరీ వెంకటేష్ ను సోమవారంపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.