- అభివృద్ధి,పార్టీ కార్యక్రమాల ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర కీలకం
- రేగన్న గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
- సోషల్ మీడియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కర్నే మురళి
మన్యం న్యూస్ కరకగూడెం:అభివృద్ధి,పార్టీ కార్యక్రమాల ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర కీలకం అని సోషల్ మీడియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కర్నే మురళి అన్నారు.
ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియానే కింగ్ మేకర్ అని, ప్రత్యర్థుల విమర్శలు వదలిపెట్టి బీఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు చేరవేయాలని,రేగాన్న గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రచారంలో కీలక భూమిక సోషల్ మీడియానేనని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్‌నే హ్యాట్రిక్ సీఎం అని,బీఆర్‌ఎస్ పార్టీ గెలుపులో ప్రతి ఒక్క కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని,రేగాన్న చేసిన అభివృద్ధి పనులు ప్రతి గడపకూ చేరాలని పిలుపునిచ్చారు. మండల సోషల్ మీడియా ప్రత్యేక సమావేశం సోమవారం మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు రావులో సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కటకం లెనిన్, సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమళ్ల ప్రవీణ్, సోషల్ మీడియా వారియర్స్ రామటెంకి పూర్ణ చంద్రశేఖర్, గిద్దె సాయి కిరణ్, గాందెర్ల సతీష్, ఊకె నరేష్, ధర్మారపు సంతోష్, నరేందర్, శ్రీనివాస్, శ్యామ్, ప్రకాష్, శ్రీను, సూర్యం, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.