మన్యం న్యూస్ దుమ్ముగూడెం, అక్టోబర్ 30::
దుమ్ముగూడెం మండలంలో ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించి, కరువు మండలంగా ప్రకటించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని సింగవరం పంచాయతీలో వర్షం లేక ఎండిపోయిన పంట పొలాలను సిపిఎం పార్టీ భద్రాచలం నియోజకవర్గం కారం పుల్లయ్య తో కలిసి వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఎకరాల పత్తి వరి పంటలు ఎండిపోయాయని నష్టపోయిన పంటకు ఎకరానికి 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలానే తాళి పేరు ఎడమ కాలువ ఆఖరి వరకు రైతులకు నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చంద్రయ్య నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు రైతు సంఘం మండల అధ్యక్షులు బొల్లి సత్యనారాయణ మల్లారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్థానిక రైతులు మధు వెంకటేశ్వర్లు గోవిందు కామయ్య తదితరులు పాల్గొన్నారు.