- కారు గుర్తుకు ఓటు వేద్దాం కాంతన్నను గెలిపిద్దాం.
- గ్రామలలో విస్తృతంగా బీఆర్ఎస్ శ్రేణుల పర్యటన గడపగడపకు బీఆర్ఎస్ కరపత్రాలు పంపిణి
మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని చొప్పాల గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం విస్తృతంగా పర్యటించి గడపగడపకు తిరుగుతూ నూతన మేనిఫెస్టో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఆధ్వర్యంలో కారు గుర్తుకు ఓటు వేసి రేగా. కాంతన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నేడు పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నియోజకవర్గాని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని మరల కారు గుర్తుకు ఓటు వేసి రేగా కాంతారావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి,బూతు కమిటీల ఇంచార్జీ రావుల.శ్రీనివాస్,బుడగం.రాము,యువజన నాయకులు కటకం.లేలిన్,ఎగ్గడి. శ్రీనివాస్,కటుకోజ్వల. దిలీప్, నిట్టా.ప్రభాకర్,పాయం.రాజబాబు, గుడ్ల.చిట్టి.సత్తీష్ కుమార్,జవ్వాజి.సమ్మయ్య,తోలెం. సారయ్య,తదితరులు పాల్గొన్నారు.