- స్పీడ్ పెంచిన కారు పార్టీ
- ప్రచార హోరు చేరికల జోరు
- అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష
- కాంగ్రెస్ పార్టీ నుంచి 15 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరిక
- గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:
పినపాక నియోజకవర్గం లో కారు పార్టీ స్పీడ్ పెంచింది. ఒకపక్క విస్తృత ప్రచారం నిర్వహిస్తూ,మరొక పక్క చేరిక లతో బిఆర్ఎస్ నాయకులు జోరు పెంచారు.మణుగూరు మండలం లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బుగ్గ గ్రామ పంచాయతీకి నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు,బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 15 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతరావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతరావు మాట్లాడుతూ,ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికునిలా పని చేయాలన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాలని తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను గడపగడపకు చేరేలా అందరూ కలసికట్టుగా పని చేయాలన్నారు.బిఆర్ఎస్ మేనిఫెస్టో పేద ప్రజల పాలిట వరంగా ఉందన్నారు.కెసిఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా పథకం ఒక చారిత్రాత్మక నిర్ణయం అన్నారు.95 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని వారు తెలిపారు.మహిళల కోసం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు,సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. పినపాక నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, మణుగూరు మండలం, పట్టణంలోని మారుమూల గ్రామాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలన్నారు.కళ్ళ ముందున్న సంక్షేమాన్ని, ఇంటిముందు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటు వేయాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు అండగా నిలుస్తూ,ఇతర పార్టీలో చెందిన నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వారు తెలిపారు.రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బుగ్గ సర్పంచ్ తాటి రామకృష్ణ, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,స్థానిక నాయకులు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.