UPDATES  

 రిస్క్ వద్దు బీఆర్ఎస్ సర్కారే ముద్దు..

  • రిస్క్ వద్దు బీఆర్ఎస్ సర్కారే ముద్దు
  • కారు జోరు ప్రచార హోరు
  • బిఆర్ఎస్ మేనిఫెస్టో సూపర్ హిట్
  • ఇంటింటికి ప్రచారంలో బిఆర్ఎస్ శ్రేణులు

 

మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు మండలం లోని లోని సమితి సింగారం,అశోక్ నగర్,వాగు మల్లారం, రామానుజవరం,తొగ్గుడేం,న్యూ పద్మ గూడెం గ్రామాలలో గడపగడపకు ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.సీఎం కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో తో ప్రజలందరికీ ఎంతో మేలు జరుతుందని అన్నారు. మూడోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కెసిఆర్ బీమా పథకం ద్వారా రాష్ట్రం లోని 95 లక్షల మంది పేదలకు భీమా కల్పించడం జరుగుతుందన్నారు.అర్హులైన మహిళలందరికీ సౌభాగ్య లక్ష్మీ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు.అన్నపూర్ణ ద్వారా సన్న బియ్యం,400 రూపాయలకే గ్యాస్ అందజేస్తామన్నారు.రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 10 వేలు ఇస్తుండగా వాటిని 16 వేలకు పెంచుతామని,ఆసరా పింఛన్లు 5 వేలు,దివ్యాంగు లకు 6 వేలు చెల్లిస్తామన్నారు.బిఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ,గడప గడపకు విస్తృత ప్రచారం నిర్వహించారు.మణుగూరు లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు.రాబోయే ఎన్నికల్లో మరొకసారి బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,సర్పంచ్ బొగ్గం. రజిత,ఉప సర్పంచ్ ప్రభుదాస్, సొసైటీ డైరెక్టర్ మామిడిపల్లి సీతారాములు,స్థానిక ప్రజాప్రతినిధులు,వార్డు మెంబర్ లు,బర్మావత్ నరసింహారావు,బోడా బీరమ్మ, బూత్ ఇంచార్జ్ లు దారావత్ రమా,కుంటా లక్ష్మణ్, చెన్నకేశవులు,సూత్రపు నాగభూషణం,దాసరి లీలావతి,కొట్టే ఉమాశ్రీ జుంకంటి వెంకన్న,మోతుకూరు సంపూర్ణ,ఉసికల కేశవరావు మార్గం శ్రీలత.తిప్పలి లక్ష్మి, బోయల సృజన,సంగీత,ఎండి ఆశ,కవిత,టి శశిధరణి, యాకుబ్ అలీ,పార్టీ కార్యకర్తలు,యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !