UPDATES  

 దళిత బంధు పథకం రాబందుల రాజ్య.. దళిత బందు ఇప్పిస్తామంటూ దళారులు మోసం..

  • దళిత బంధు పథకం రాబందుల రాజ్యం
  • దళిత బందు ఇప్పిస్తామంటూ దళారులు మోసం
  • కోట్ల రూపాయలు అర్జించిన కాంగ్రెస్ నాయకులు
  •  పుస్తెలతాడు అమ్మి, మిత్తికి అప్పు తెచ్చి కట్టిన బాధితులు

మన్యం న్యూస్ వాజేడు:

 

 

దళిత బంధు పథకంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల కాంగ్రెస్ మండల స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు దళిత బంధు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు, పేపర్ ప్రకటనలు వచ్చాయి. తాజాగా ములుగు జిల్లా, భద్రాచలం నియోజకవర్గం వాజేడు మండలంలోని చెరుకూరు గ్రామానికి చెందిన వేల్పుల ఉదయ దళిత బంద్ ఇప్పిస్తానంటే ఎమ్మెల్యే పి ఏ కి క్యాంప్ ఆఫీసులో రెండు లక్షల రూపాయలు నగదు ఇచ్చానని తెలిపారు. నేరుగా ఎమ్మెల్యేకి ఇస్తానని చెప్పడంతో,దీంతో డబ్బులు ఇచ్చిన బాధితురాలకు నమ్మకం కలిగింది .

భద్రాచలం నియోజకవర్గం లో రెండో విడత దళిత బంద్ కు అర్హులైన పేర్లు బయటకి రావడంతో ముడుపులు చెల్లించిన వారి పేర్లు లేకపోవడంతో అసలు కథ మొదలైంది.

రెండు లక్షల కట్టండి దళిత బంధు ఇప్పిస్తామంటూ అనేక మాయమాటలు చెప్పి వాజేడు మండలంలో దళిత బంధు పథకాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలు అర్జించిన దళిత బంధు దళారీలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. బాధితులు నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారు.రేపు ఇస్తా, మాపిస్తా అంటూ నెలలు గడిపాడు. దీంతో బాధితురాలు మీడియాను ఆశ్రయించారు. ఎమ్మెల్యే అనుచరులు మండల కేంద్రంలో దళితబంధు రెండో విడత ఇప్పిస్తామని చాలా మంది దగ్గర ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలు రూపాయలు వసూలు చేశారు రానివారికి ఇచ్చిన డబ్బులను.

దళిత బంధు పథం రాని వారికి ఇచ్చిన డబ్బులను వడ్డీతో సహా చెల్లిస్తానని సదర్ నేతలు చెప్పినట్లు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులకు దళిత బంధు నియోజకవర్గంలో రాకపోవడంతో వారు అగ్రిమెంట్ ప్రకారం తమ డబ్బులు ఇవ్వాలని కొద్ది రోజులుగా వందనాలు జరుపుతున్నారు .దీనికి ఆయన ఎన్నికలు అయిపోయేంత వరకు ఆగాలన్నారని. లేకుంటే మీ ఇష్టమున్నట్టు చేసుకొమ్మని తేల్చి చెప్పడంతో, ఏమి చేయాలో తోచక మీడియాను ఆశ్రయించినట్లు వేల్పుల ఉదయ తెలిపారు.

కొంతకాలంగా అనారోగ్యంతో క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతున్నట్లు. ఈ విషయమై విచారణ జరిపించి న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను కోరారు. కలెక్టర్ తక్షణమే స్పందించి దళిత బందు దళారుల చేత మోసం పోయిన వారికి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !