మన్యం న్యూస్ కరకగూడెం:
పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా.కాంతారావు ఆదేశాల మేరకు పినపాక నియోజకవర్గ తెలంగాణ ఉద్యమ నేత పోడియం నరేందర్ సోమవారం చతిస్గడ్ నుండి వలస వచ్చిన గుత్తి కోయ ఆదివాసుల గుంపులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వలస ఆదివాసీ గ్రామలు అశ్వపూరంపాడ్,నిలద్రిపేట,నర్సపూరం,మనుబోతుల గూడెం,రేగళ్ళ భగ్యనాగరం, గ్రామలలో పర్యటించి ఇంటింటికి తిరుగుతు కారు గుర్తుకి ఓటు వేయ్యాలని వలస ఆదివాసులను వేడుకున్నారు.అలాగె అన్ని వర్గల ప్రజలు,గ్రామలు అభివృద్ధి చెందాలి అంటె కారు గుర్తుకి ఓటు వేసి రేగా కాంతారావు ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనంతారం ఉప సర్పంచ్ అత్తె సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాటి.వెంగళ రావు, కొలగాని.పాపారావు, పసునూరి.అంజయ్య,షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.