మన్యం న్యూస్,అక్టోబర్31:
కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం రాష్ట్రీయ ఏక్తా దివాస్‌ను నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాలలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మీటకోటి సింహాచలం మాట్లాడుతూ స్వాతంత్య్ర వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయి పటేల్ కఠిన నిర్ణయాలతో భారత జాతిని, దేశాన్ని ఐక్యత పర్చారని కొనియాడారు. ఎన్నో త్యాగాలతో సిద్దించిన స్వాతంత్రాన్ని యువత ఐకమత్యం గా ఉంటూ సుసంపన్నం చేయాలని కోరారు. జాతీయ సేవా పథకం అధికారులు జయప్రకాశ్, మోహన్, అధ్యాపకులు మల్లిక, దుర్గాప్రసాద్, వనిత, పార్ధసారధి, రమ, లక్ష్మినారాయణ, రాంబాబు, యాకయ్య, ఖాసీం, బాబురావు, కవిత, కృష్ణవేణి, పాషా, సుధీర్, సతీష్, బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు