మన్యం న్యూస్: జూలూరుపాడు, అక్టోబర్ 31, మండల పరిధిలోని కాకర్ల గ్రామ శివారులో గల పంట పొలాలలో పేకాట ఆడుతున్నా రన్న విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక ఎస్సై బి పురుషోత్తం తన సిబ్బందితో కలిసి మంగళవారం పేకాట స్థావరంపై మెరుపు దాడి చేశారు. అదే గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 2,600 రూపాయల నగదు తో పాటు, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని, వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి పట్టుబడ్డ సదరు వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
