మన్యం న్యూస్, గుండాల: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గం అభ్యర్థి రేగా కాంతారావు గెలుపు కోసం కృషి చేస్తామని మామ కన్ను పంచాయితీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. మంగళవారం పంచాయతీలోని గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ డోర్ పోస్టర్లను అంటించి రేగా కాంతారావు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేస్తున్న రేగాను గెలిపిస్తే అభివృద్ధి మరింతగా ముందుకు సాగుతుందని నేతలు పేర్కొన్నారు. పంచాయతీలో కారు గుర్తుకు అత్యధిక ఓట్లు సాధించే విధంగా పనిచేస్తామని నాయకులు తెలిపారు.
