మన్యం న్యూస్ గుండాల: ఎన్నికల నేపథ్యంలో మన్యంలో మావోయిస్టుల కరపత్రాలు చర్చనీయంగా మారాయి. మండలం పరిధిలోని జామరగూడెం గ్రామ సమీపంలో చింత చెట్టు వద్ద గత రాత్రి మావోయిస్టులు కడపత్రాలను విడిచిన నేపథ్యంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. గత కొద్దికాలం మండలంలో మావోల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు ఒక్కసారిగా వెలసిన కరపత్రాలతో మండలంలో చర్చనీయంగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో అని మండల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరపత్రాలను గుండాల పోలీసులు స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు
