- బీఆర్ఎస్ పార్టీలోకి భారి చేరికలు
- దమ్మపేట నుంచి 11కుటుంబాలు బీఆర్ఎస్ లోకి
- కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా
మన్యం న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 31: అశ్వారావుపేట నియోజకవర్గ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో మంగళవారం దమ్మపేట టౌన్ నుంచి 11 కుటుంబాలు అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో మట్ట మధు, మల్ల గణేష్, మల్ల సాయి, మిడత శ్రీను, సింహాద్రి సాయి, సాంబ, పానుగంటి గణేష్, మల్ల అంజి బాబు, సురేందర్ నాయక్, బోగం రామకృష్ణ, మురికి శ్రీను తదితరులు ఉన్నారు.