మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గోల్డ్ షాప్ లైన్ ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పర్యటించారు.ఈ సందర్భంగా గోల్డ్ షాప్ లైన్ ఏరియాలోని రామాలయంలో, సాయిబాబా ఆలయంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు విప్ రేగాకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుని ప్రార్ధించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.