మన్యం న్యూస్ మణుగూరు:
పినపాక మండలంలోని జానంపేట గ్రామానికి చెందిన కొమరం సుభద్ర అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ, సంఘమిత్ర హాస్పిటల్లో చికిత్స పొందుతూ, 0 పాజిటివ్ బ్లడ్ అవసరం అని,బాధితులు రేగా బ్లడ్ బ్యాంకు ను సంప్రదించగా రేగా బ్లడ్ బ్యాంక్ సభ్యులు రేగా రవి వెంటనే స్పందించి సభ్యులు నల్లగట్ల ప్రవీణ్ కుమార్ తో మాట్లాడి వెంటనే రక్తదానం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.రక్తదానం అనంతరం రేగా రవి మాట్లాడుతూ,అన్ని దానాలలో కన్న రక్తదానం చాలా గొప్పదన్నారు.రక్తం అనేది కృత్రిమంగా ఉత్పత్తి చేయబడదని,రక్తదానం చేయడం అంటే మరొకరికి ప్రాణదానం చేయడమేనని వారు తెలిపారు.ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా,ఎటువంటి సమయం లో అయినా,ఏ గ్రూప్ బ్లడ్ కొరకు అయినా సరే రేగా బ్లడ్ బ్యాంకు ను సంప్రదించాలని రేగా రవి తెలిపారు.ఈ కార్యక్రమంలో సీసీ రేగా రవి, మణుగూరు యూత్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం సృజన్ రాజ్,యువజన నాయకులు జక్కం రంజిత్ కుమార్ గంటక యేశావ్,సోషల్ మీడియా మణుగూరు మండల కోఆర్డినేటర్ డేగల సంపత్ కుమార్,హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.