UPDATES  

 కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు..పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన బట్ట విజయ్ గాంధీ అభిమాని..

  • కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు
  • నాకే టికెట్ ఇవ్వండి
  • లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా
  • ఏఐసీసీ అధిష్టానానికి బట్ట విజయ్ గాంధీ అల్టిమేటం
  • పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన బట్ట విజయ్ గాంధీ అభిమానీ

మన్యం న్యూస్ ,అశ్వాపురం: పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు ఇప్పట్లో చల్లారేలా లేవు. రోజు రోజుకి వర్గ పోరు ఉదృతం అవుతుంది. పార్టీని నమ్ముకుని ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కాదని పారాచూట్ నాయకులకి టికెట్ దక్కడంతో పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి .అశ్వాపురం మండలం మొండికుంట లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ ను బట్ట విజయ్ గాంధీ మొదటినుండి ఆశిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో పినపాక నియోజకవర్గం హస్తం టికెట్ మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కేటాయించారు. దీనితో మనస్థాపం చెందిన బట్ట విజయ్ గాంధీ తాడోపేడో తెలుసుకోవడానికి అధిష్టానంతో అమితునికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో పినపాక నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ కి చెందిన బట్ట విజయ గాంధీ అభిమానులు మొండికుంటలో సమావేశమయ్యారు. పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ బట్ట విజయ గాంధీకి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలోనే విజయ్ గాంధీ అభిమాని ఒకరు పెట్రోలు మీద పూసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. దీనితో సమావేశంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తనను మోసం చేయడం తగదని బట్ట విజయ్ గాంధీ ఆవేదన వెలుగుచ్చాడు. అధిష్టానం తనకే హస్తం పార్టీ టికెట్ కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, బట్ట విజయ్ గాంధీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !