UPDATES  

 బీ ఆర్ ఎస్ లో చేరిన శివశక్తి రాష్ట్ర నాయకులు దండు సారయ్య..కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్..

మన్యంన్యూస్,ఇల్లందు: తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ భవన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, శివశక్తి రాష్ట్రనాయకులు దండు సారయ్య బుధవారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని తెలంగాణ భవన్ సాక్షిగా బిఆర్ఎస్లో చేరారు. ఆయనకు తెలంగాణ పురపాలక శాఖమంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ముదిరాజ్, శివశక్తి నాయకులకు రాష్ట్రంలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అదేవిధంగా వారికి రానున్నరోజుల్లో అన్నివిధాలుగా తగినన్యాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ను అందరూ సమిష్టికృషితో భారీ మెజారిటీతో గెలిపించి ఇల్లందు గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసి చరిత్ర సృష్టించాలని మంత్రి వారికి సూచించడం జరిగింది. దండు సారయ్యతో పాటు పట్టణంలోని పలువార్డుల నుండి ప్రముఖులైన బాణాల శ్రీనివాస్, కోటగిరి రాజేందర్, కోటగిరి నవీన్, మహేష్, శేఖర్, వెంకటేష్, ప్రవీణ్, రాజు తదితరులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్, శివశక్తి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !